హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): జనగామలోని ఒక మెడికల్ షాపులో ఎలాంటి అనుమతులు లేని ‘స్టోన్ఫైట్’ అనే నకిలీ ఆయుర్వేద ఔషధం పట్టుబడిందని డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మూత్రపిండాల్లో రాళ్లను తొలిగిస్తుందని నమ్మిస్తూ దీనిని విక్రయిస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్ పరిధి పుప్పాలగూడలోని మరో మెడికల్ షాపులో ‘పానియన్’ పేరిట నకిలీ ఔషధాలను అమ్ముతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. దీనిని రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఫైబ్రిటైటిస్ వంటి చికిత్సలో వాడతారనే ప్రచారం చేసున్నారని పేర్కొన్నా రు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ మెడికల్ షాప్‌లో సప్తామృత్ పేరుతో నకిలీ ట్యాబ్లెట్లు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయని ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఆయా ఔషధాలను సీజ్ చేశామని తెలిపారు.