కొవిడ్‌తో కంటి సమస్యలు

- తోడైన వర్క్ ఫ్రం హోం, ఇతర కారణాలు
- డాక్టర్ అగర్వాల్స్ వైద్య బృందం వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సోకినవారిలో కంటి సమస్యలు మొదలవుతున్నట్టు గుర్తించామని డాక్టర్ అగర్వాల్స్ కంటి దవాఖాన వైద్య బృందం పేర్కొన్నది. కండ్ల కలక, కెరాటో కంజెక్టివైటిస్, బ్లీ ఫార్టీస్, రెటినల్ మైక్రోవాస్కులర్ సమస్యలు వంటివి కనిపిస్తున్నాయని దవాఖాన రీజినల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ అరోరా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఐసీయూలో చికిత్స పొందిన రోగుల్లో కార్నియల్ ఇన్ఫెక్షన్స్, ఇషెమిక్ ఆప్టిక్ న్యూరోపతి, వాల్సావా రెటినోపతి తదితర ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయని చెప్పారు. గత ఏడాదికాలంలో ప్రజల్లో కంటి సమస్యలు పెరిగాయని, ముఖ్యంగా అడ్వాన్స్డ్ కాటరాక్ట్, పొడికండ్ల కేసులు 5 రెట్లు పెరిగాయని చెప్పారు. కరోనా కారణంగా చికిత్సను ఆలస్యం చేయడం, వర్క్‌ఫ్రం హోం వల్ల జీవితంలో సమతుల్యం దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు. 2019 చివరి త్రైమాసికంలో తమ వద్దకు వచ్చిన కాటరాక్ట్ రోగుల్లో 10 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే అడ్వాన్స్ కాటరాక్ట్తో బాధపడేవారని, గతేడాది చివరికి ఈ సంఖ్య 50 శాతానికిపైగా పెరిగిందని చెప్పారు. డిజిటల్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల కండ్లు పొడిబారడం (డ్రై ఐస్) కేసులు కూడా పెరిగాయన్నారు. 2019 చివరికి 10 శాతం ఉన్న ఈ కేసులు గతేడాది చివరినాటికి 30-50 శాతానికి పెరిగాయని వెల్లడించారు. వీటితోపాటు గ్లకోమా కేసులు కూడా పెరిగినట్టు గుర్తించామన్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు కరోనా కాలం లో పరీక్షలు సరిగా చేయించుకోకపోవడంతో వారి రెటీనాలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని వివరించారు. కొందరు సమస్య తీవ్రంగా ఉన్నా కరోనాకు భయపడి కాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకోవడం ఆలస్యం చేశారని, దీంతో పాక్షికంగా కంటి చూపు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో దవాఖాన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- Covid19
- dr agarwal
- eye
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

