MBBS admissions | ఎంబీబీఎస్ ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడగింపు
MBBS admissions | ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. రెండో విడుత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 7ని రిపోర్టింగ్ గడువుగా మొదట నిర్ణయించారు.
వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 7 : ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. రెండో విడుత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 7ని రిపోర్టింగ్ గడువుగా మొదట నిర్ణయించారు. గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి రిపోర్టింగ్ గడువును పెంచాలని మెడికల్ కౌన్సిల్ కమిటీ(ఎంసీసీ) నిబంధనల ప్రకారం మూడో విడత కౌన్సెలింగ్ అవకాశాన్ని కల్పించాలని లేకపోతే తెలంగాణ విద్యార్థులకు నష్టం కలుగుతుందని వివరించారు.
స్పందించిన మంత్రి అభ్యర్థుల వినతిని పరిగణలోకి తీసుకొని రెండో విడుత అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతిని ఆదేశించారు. ఈమేరకు రెండో విడుత కౌన్సెలింగ్ సీటు సాధించిన విద్యార్థులకు రిపోర్టింగ్ గడువును సెప్టెంబర్ 8వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకు పెంచుతూ సంబంధిత ధ్రువపత్రాలతో కేటాయింపు జరిపిన కళాశాలల్లో రిపోర్టు చేయాలని తెలియజే.. మూడో విడుత కౌన్సెలింగ్ పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

