అందరికీ టీకాలు

- అందుకోసం సత్వర ఏర్పాట్లు చేస్తున్నాం
- అంతర్జాతీయ స్థాయిలోనూ సేకరణ
- తయారీ సంస్థలకు సంపూర్ణ సహకారం
- ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
- ఫార్మా, వ్యాక్సిన్ తయారీదారులతో భేటీ
- నాటోఫార్మా నుంచి రూ. 4.2 కోట్ల బారిసిటినిబ్ గోలీల విరాళం: రాజీవ్
సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా తయారు చేస్తున్న స్థానిక కంపెనీలతోపాటు అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇందుకోసం అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా తయారుచేస్తున్న స్థానిక కంపెనీలతోపాటు అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. భారీ ఎత్తున వ్యాక్సిన్లను ప్రొక్యూర్ చేసుకొనేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని తెలిపారు.
మంత్రి కేటీఆర్ సారధ్యంలోని కరోనా టాస్క్‌ఫోర్స్ కమిటీ శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్రంలో కొవిడ్ మందుల సరఫరా, వ్యాక్సిన్ సేకరణ తదితర అంశాలపై ఫార్మా సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తిని పెంచాలని కోరారు. అందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు.
కరోనా మహమ్మారిని పూర్తిగా పారదోలాలంటే ప్రజలందరికీ వీలైనంత త్వరగా టీకా వేయాల్సి ఉన్నదన్నారు. ఈ మేరకు వ్యాక్సిన్ సరఫరా పెంపుపై రాష్ర్టాల్లో వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ వంటి సంస్థలకు స్థానికంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు.
టాస్క్‌ఫోర్స్ సమావేశానికి నాటో ఫార్మా, బయోలాజికల్- ఈ, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సనోఫి ఇండియా, వర్చ్యు బయోటెక్, గ్లాండ్ ఫార్మా, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో టాస్‌ఫోర్స్ సభ్యులు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కమిషనర్ రాహుల్ బొజ్జా, సీఎంవో కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
కరోనా నియంత్రణ కార్యక్రమాలకు చేయూత
రాష్ట్రప్రభుత్వం కరోనా నియంత్రణకు కోసం చేస్తున్న కార్యక్రమాలకు టీఎస్ఐఐసీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.1.19 కోట్లు అందజేసింది. కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ఇందుకు సంబంధించిన చెకును మంత్రి కేటీఆర్ సమక్షంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కమిషనర్ రాహుల్ బొజ్జాకు అందించారు. నాటోఫార్మా వైస్‌చైర్మన్, సీఈవో రాజీవ్ నన్నపనేని రూ.4.2 కోట్ల విలువైన బారిసిటినిబ్ మాత్రల విరాళానికి సంబంధించిన అనుమతి పత్రాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

