SLBC Tunnel | హైదరాబాద్, మార్చి1 (నమస్తే తెలంగా ణ): ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ముందస్తు అధ్యయనలోపమే ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. షియర్ జోన్‌కు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో ప్ర భుత్వం, నిర్మాణ సంస్థలు విఫలమయ్యాయ ని పేరొంటున్నారు. ఆ నిర్లక్ష్యమే కార్మికులకు శాపంగా మారిందని వారు తేల్చి చెప్తున్నారు. పనుల కొనసాగింపుపై ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. లోపాలను సరిచేసుకొని ముందుకు సాగాలని చెప్తున్నారు. పనుల్లో లోపాలపై వారు చెప్పిన పలు విషయాలు కింది విధంగా ఉన్నాయి.
భూమి పొరలు వదులుగా ఉండే షియర్ జోన్‌లోనూ డ్రిల్లింగ్ అనంతరం బిగించేందుకు 0.3 లేదా 0.4 మీటర్ల మందం ఉన్న ఆర్సీసీ ప్రీ కాస్ట్ ప్యానళ్లను వాడినట్టు తెలుస్తున్నదని నిపుణులు చెప్పారు. షియర్ జోన్లో పైనుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఈ మందం సరిపోదని, కనీసం 0.85 మీటర్ల నుంచి 1.2 మీటర్ల మందం ఉండే ప్యానళ్లను వాడాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. షియర్ జోన్లో ఆర్సీసీ ప్యానెల్‌తో పాటు అర్ధచంద్రాకారంలో కనీసం 125, 250 మందంతో ఉం డే ఇనుప స్తంభాలను (ఐఎస్ఎంబీ రిబ్స్) వా డితే మరింత బలంగా ఉండేవని చెప్పారు. స్టీల్ లైనర్లనైనా వాడాల్సి ఉండేదని తెలిపారు.
అభయారణ్యం పరిధిలో, పైగా షియర్ జోన్ ప్రాంతంలో టీబీఎంతో డ్రిల్లింగ్ చేయ డం ప్రమాదకరమని నిపుణులు తేల్చిచెప్పా రు. డ్రిల్లింగ్, కెమికల్ బ్లాస్టింగ్ విధానమే మే లైనదని సూచిస్తున్నారు. ఈ అంశంలో నిర్మా ణ సంస్థ గాని, ప్రభుత్వం గాని అధ్యయనం చేసినట్టుగా కనిపించలేదని స్పష్టంచేశారు. ప్రతి మూడు నాలుగు మీటర్లకు ఒకసారి హారిజంటల్ డ్రిల్లింగ్ (గ్లోరీ హోల్స్) చేసి భూపొరల పటిష్టతను పరీక్షించాలని సూచిస్తున్నారు.
టన్నెల్ నిర్మాణ సమయంలో రెండు సొ రంగాల (ట్విన్ టన్నెల్) విధానం ఉత్తమమైనదని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ రెండు సొరంగాలు తవ్వడం వీలుకానప్పుడు, నిర్ణీత దూరంలో సురక్షిత చాంబర్లను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి టన్నెల్ పనులకు ముందు డ్రిల్లింగ్ చేసి, భూపొరల పటిష్టతను అధ్యయనం చేస్తారని, అభయార ణ్యం కావడంతో జీఎస్ఐ జియోలజికల్ ఇన్వెస్టిగేషన్ జరగలేదని చెప్పారు. ఇప్పటికైనా స ర్వే చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.