Harish Rao | జలదృశ్యం టు తెలంగాణ భవన్.. ఇదీ శ్రీనివాస్ రెడ్డి ప్రస్థానం : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే గుర్తొచ్చే పేరు కేసీఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి పేరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే గుర్తొచ్చే పేరు కేసీఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి పేరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ భవన్లో ఎవరున్నా లేకపోయినా.. శ్రీనివాస్ రెడ్డి ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా ఉండి పోయేవారు. జల దృశ్యం కావొచ్చు.. తెలంగాణ భవన్ కావొచ్చు.. ఎక్కడైనా సమయపాలన కచ్చితంగా పాటించేవారు. జలదృశ్యం టు తెలంగాణ భవన్..ఇదీ శ్రీనివాస్ రెడ్డి ప్రస్థానం అని హరీశ్‌రావు ప్రశంసించారు.
ఆ నిమిషం నుంచే ఆఫీసు సెక్రటరీగా మారిపోయారు..
చాలా మందికి రాజకీయాల్లోకి రావాలని ఉంటుంది. ఇలా వచ్చే వారిలో ఒక్కొక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ మాదిరిగానే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రావాలనే ఆకాంక్షతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జలదృశ్యంలో పార్టీ పెట్టాక మూడో రోజు శ్రీనివాస్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి కలిసి కేసీఆర్‌ను పరిచయం చేసుకున్నారు. 1999లో వెటర్నరీ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యాను. 1969లో తెలంగాణ కోసం పోరాడి జైలుకు వెళ్లాను అని శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్‌కు చెప్పారు. అప్పుడే బాగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని రామ్మోహన్ రెడ్డి కేసీఆర్‌తో అన్నారు. ఆ నిమిషం నుంచే ఆఫీసు సెక్రటరీగా మారిపోయారు శ్రీనివాస్ రెడ్డి. పార్టీతో ఇవాళ్టి వరకు 25 ఏండ్ల ప్రస్థానం శీనన్నది. ఆయనంటే అందరికీ గౌరవం. ఆయన ముఖంలో కోపం గానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, పరుషపదజాలం కానీ ఆయన నోట ఎప్పుడూ వినలేదు. 25 ఏండ్లలో ప్రేమ, చిరునవ్వు, ఓపిక, మంచినతం చూశాను తప్ప కోపం చూడలేదు అని హరీశ్‌రావు తెలిపారు.
శ్రీనివాస్ రెడ్డి @ ట్రిపుల్ డీ..
వెటర్నరీ కాలేజీ విద్యార్థి నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శ్రీనివాస్ రెడ్డి. చెన్నారెడ్డి నాయకత్వంలో ఉద్యమం చేసి జైలుకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే బలమైన ఆకాంక్షలో ఉండే కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో పని చేశారు. శ్రీనివాస్ రెడ్డి అంటే ట్రిపుల్ డీ.. డిటర్మినేషన్, డెడికేషన్, డీవోషన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే డిటర్మినేషన్, బాధ్యతగా, నీతిగా, నిజాయితీగా పని చేయాలనే డెడికేషన్, కేసీఆర్ పట్ల దైవంగా పని చేయాలనే డీవోషన్ శ్రీనివాస్ రెడ్డిలో ఉన్నాయి. కేసీఆర్ ఈజ్ రైట్.. మై బాస్ అనే డివోషన్తో ఉండేవారు శ్రీనివాస్ రెడ్డి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేసీఆర్ కూడా భావోద్వేగానికి లోనయయ్యారు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ పోరాటం, ఆమరణ నిరాహార దీక్షను దగ్గరుండి చూశారు. 2001 నుంచి ఒడిదొడుకులు, రాష్ట్ర సాధనలో వ్యూహాలు, కృషి, జేఏసీ ఏర్పాటుకు సాక్ష్యం కాబట్టి.. ఒక పుస్తకం రాయాలని శ్రీనివాస్ రెడ్డిని కోరుతున్నాను. కేసీఆర్‌కు ఎంతో నమ్మకంగా పని చేశారు శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ కూడా భావోద్వేగానికి లోనయయ్యారు. వారికి తెలంగాణ భవన్లో, వరంగల్‌లో వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దు : హరీశ్‌రావు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ఆణిముత్యాలు.. విడుదల చేసిన హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

