KS Sreenivasa Raju | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ కేఎస్ శ్రీనివాసరాజు నియామకం
KS Sreenivasa Raju | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
KS Sreenivasa Raju | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీనివాసరాజు నియామకం అయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా సుదీర్ఘకాలంగా పనిచేసిన కేఎస్ శ్రీనివాసరాజు వీఆర్ఎస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ఐఏఎస్ క్యాడర్లో 2001 బ్యాచ్‌కు చెందిన ఆయన 2011లో వైజాగ్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఏప్రిల్ 20వ తేదీన జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు పనిచేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించి, టీటీడీలో తనదైన ముద్ర వేశారు.
అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్ కేడర్‌పై తెలంగాణ రాష్ర్టానికి వచ్చారు. తెలంగాణ నాలుగేండ్ల పాటు రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. మార్చి నెలతో డిప్యుటేషన్ గడువు ముగియడంతో పొడిగింపునకు క్యాట్‌ను ఆశ్రయించారు. అనుమతి రాకపోవడంతో ఏపీకి రాక తప్పలేదు. గత మే నెలలో ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేశారు. టీటీడీ ఈవోగా వచ్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం శ్యామలరావును ఈవోగా నియమించింది. దీంతో ఈనెల 19వ తేదీన శ్రీనివాసరాజు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో గత వారం ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

