సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
మంత్రి ఎర్రబెల్లి | కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

జనగామ : కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సూపర్ స్ప్రెడర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాన్ని మంత్రి శుక్రవారం ప్రారoభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో నేటి నుంచి సూపర్ స్ప్రెడర్స్ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్, అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,03,000, మంది సూపర్ స్ప్రెడర్స్ ను, గుర్తించామని మంత్రి తెలిపారు.
ఈ సూపర్ స్ప్రెడర్స్ లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాలలో ఉచితంగా టీకాలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 45 సంవత్సరాల పైబడినవారికి 71 వేల 895 టీకాలు (54,143 మొదటి డోస్, 17,752 రెండో డోస్) కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని మంత్రి వివరాలను వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన టీకాలు సమకూర్చనప్పటికి రాష్ట్రంలోని 18 సంవత్సరాల పైబడిన వారందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా వ్యాక్సిన్ సేకరించడానికి గ్లోబల్ టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు.
ప్రజలను మహమ్మారి నుంచి కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, మండల ప్రత్యేక అధికారి కొండల్ రెడ్డి, తహసీల్దార్ డి. స్వప్న, ఎంపీడీవో ఉమామహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

