నాటిన ప్రతి మొక్క బతకాలి : మంత్రి అల్లోల
మంత్రి అల్లోల | ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టిందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

నిర్మల్ : ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టిందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణకు హరితహారం ఏడో విడత కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎల్లపల్లిలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కరోనా లాంటి విపత్కర పరిస్థితులు చూశామన్నారు. కరోనా వల్ల సకాలంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కొల్పోయారన్నారు. ప్రాణ వాయువును ఇచ్చే చెట్లను విచక్షణ రహితంగా నరికివేయడం వల్ల ఇవాళ స్వచ్ఛమైన ప్రాణ వాయువు లభించే పరిస్థితి లేదన్నారు. భవిష్యత్ తరాలను దృష్టి పెట్టుకుని విస్తృతంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమనే కాకుండా ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంగా భావించి మొక్కలను నాటి బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి సీజనల్ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముష్రాఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బొర్కడె, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్‌లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

