ప్రతి పల్లెలో క్రీడా మైదానాల ఏర్పాటు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, జూన్ 9 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పట్టం కడుతుందని, క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని లక్ష్మణచాంద మండలం పోట్టపల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం పిల్లలతో కలిసి క్రికెట్, వాలీ బాల్ ఆడారు. కబడ్డీ పోటీలను ప్రారంభించి పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం 5వ విడత పల్లె ప్రగతిలో గ్రామీణ క్రీడా మైదానాల ప్రారంభానికి శ్రీకారం చుట్టిందన్నారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఊరిలో యువకుల కోసం ప్రభుత్వం స్పోర్ట్స్ కిట్స్ ఇస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

