మెట్రో టేకోవర్ తండ్లాట!
హైదరాబాద్ మెట్రో టేకోవర్ పరిస్థితి ‘దున్నబోతే దూడ, మోయబోతే ఎద్దు’ చందంగా మారింది. మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
- హడావుడిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
- రుణాలకోసం హెచ్ఎంఆర్ఎల్ మల్లగుల్లాలు
- ఆర్థిక సంస్థలతో చర్చలు, సర్దుబాటుకాని నిధులు
- వయబిలిటీ లేదని గతంలోనే తేల్చిన ఐఆర్ఎఫ్సీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో టేకోవర్ పరిస్థితి ‘దున్నబోతే దూడ, మోయబోతే ఎద్దు’ చందంగా మారింది. మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వంద రోజు ల్లో మెట్రోను స్వాధీనం చేసుకొని, రెండో దశను పట్టాలెక్కించడానికి అనుమతులు సాధిస్తామని ఏడాది నుంచి ప్రభుత్వం ఊరిస్తూనే ఉన్నది. తీరా ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక తండ్లాడుతున్నది. నిధుల సమీకరణ హెచ్ఎంఆర్ఎల్కు తలకు మించిన భారంగా మారింది.
ప్రధాన అడ్డంకిగా ‘వయబిలిటీ’
మెట్రో మొదటి దశను టేకోవర్ చేయాలంటే ప్రభుత్వం రూ.15వేల కోట్లను సర్దుబాటు చేసుకోవాలి. ఇందులో రూ.2 వేల కోట్లు హెచ్ఎంఆర్ఎల్కు చెల్లించగా, మిగిలిన మొత్తానికి అప్పు రూపంలో నెలవారీ భారాన్ని మోయాల్సి ఉంటుంది. మెదటి దశ స్వాధీనం కోసం జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వెంట పడుతున్న ప్రభుత్వానికి ‘వయబిలిటీ’ అంశం అతిపెద్ద అడ్డంకిగా మారింది. గతంలోనే రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ఈ ప్రాజెక్టును పరిశీలించి ఆదాయం, ని ర్వహణ వ్యయం లెక్కలేసింది. లాభసాటి కాదంటూ రుణాల మంజూరుకు విముఖత వ్యక్తంచేసింది. అయినా మెట్రో ఉన్నతాధికారులు ప్రతి ఫైనాన్స్ సంస్థ చుట్టూ తిరుగుతూ నిధుల సర్దుబాటుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీని వివరిస్తూ, రుణం కోసం మల్లగుల్లాలు పడుతున్నా ఫలితం కనిపించడంలేదు.
సర్దుబాటు చేయలేక గడువుపొడిగింపు
మెట్రో మొదటిదశ నుంచి ఎల్అండ్ టీ కంపెనీ బయటపడటానికి ఆర్థిక భారం ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ అం శంపై ఏ మాత్రం అవగాహన లేకుండానే ప్రభుత్వం స్వాధీన ప్రతిపాదనలను తెరమీదకు తీసుకొచ్చిందని నిపుణులు విమర్శిస్తున్నారు. వచ్చే ఆదాయం ఎంత? రుణాల రూపంలో సర్కార్‌పై పడే భారం, నిధుల సర్దుబాటు వంటి అంశాలను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నా రు. ముందస్తు ప్రణాళిక లేకుండానే, భవిష్యత్తులో గుదిబండలా మారే మెట్రోను ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నే. అప్పులిచ్చే సంస్థల కోసం ప్రభు త్వం ఎదురుచూస్తూనే ఉన్నది. రుణం దొరికేదాకా స్వాధీన గడువును పొడిగిస్తూనే ఉంటారని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు.
ప్రశ్నార్థకంగా రెండో దశ
మెట్రో రెండోదశ విస్తరణకు ఇప్పటికే సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్ట్-ఏలో భాగంగా నాగోల్ నుంచి ఎయిర్‌పోర్టు, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాం ద్రాయణగుట్ట, మియాపూర్ నుంచి పటాన్చెరు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 76.4 కిలోమీటర్ల మెట్రో మార్గానికి రూ.25 వేల కోట్ల అంచనాతో డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించాల్సి ఉన్నది. పార్ట్-బీలో మరో 85 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గం నిర్మించేలా డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు మరో రూ.40వేల కోట్లు అవసరం. మొదటి దశ స్వాధీనానికే రుణాలు అందని తరుణంలో రెండు, మూడో దశలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

