హైదరాబాద్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): విదేశాల్లో నర్సింగ్‌తోపాటు స్కి ల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికుల నియామకం కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు టామ్‌కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. గల్ఫ్ దేశాలతోపాటు ఆస్ట్రేలియా, మాల్టా, మారిషస్, జపాన్, జర్మనీ తదితర దేశాల కోసం ఈ నియామకాలు చేపడుతున్నట్టు చెప్పిం ది.
4న కరీంనగర్‌లోని టాస్క్ రీజినల్ సెం టర్లో, 5న రామగుండం ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో, 6న మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 10 గంటల నుంచి డ్రైవ్ ఉంటుందని పేర్కొన్నది. వివరాలకు www.tomcom.telangana.gov.in వెబ్సైట్ లేదా 8247838789, 7893566493, 9849639539 నంబర్లలో కానీ సంప్రదించవచ్చని తెలిపారు.