తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని సర్కారు పాఠశాలల్లో తెలుగు మీడియం బోధనతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధనకు అనుమతులు లభించాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన లేదు. తాజాగా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం సెక్షన్‌కు కూడా అనుమతి ఇస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.