Encounter | ఛత్తీస్గఢ్లో నక్సల్స్, మావోలకు మధ్య ఎదురుకాల్పులు
Encounter | ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి.
Encounter | ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి. ఎన్కౌంటర్ను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. జిల్లాలోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారాయిగూడ-రేగడగట్ట ప్రాంతంలో కోట ఏరియా కమిటీ కమాండర్ మంగడు, వెట్టి భీమాతో పాటు పలువురు మావోలు ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు డీఆర్జీ బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిందని పేర్కొంది.
అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగానే.. రేగడగట్ట గ్రామ సమీపంలోకి జవాన్లను చూసిన మావోలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన డీఆర్జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో నలుగురైదుగురు గాయపడ్డారని భద్రతా దళం ప్రకటించింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DRG jawans
- Encounter
- Maoists
- Sukma
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

