సిమెంటు పరిశ్రమను తెరవాలి

- కేంద్రానికి సాధన కమిటీ డిమాండ్
ఆదిలాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తెరిపించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జిల్లాలో రోజురోజుకూ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బాధితులతో కూడిన సీసీఐ సాధన కమిటీ గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. అనంత రం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. వీరికి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీసీఐని తెరిపించాలని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కోరినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర తీరును నిరసిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేస్తామని సీసీఐ సాధన కమిటీ సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రారంభిస్తే, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తిచేసినా ప్రయోజనం లేకుం డా పోయిందన్నారు. 2015నుంచి కేంద్రంలోని మంత్రులను కలిసి సీసీఐని తెరిపించాలని కోరు తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

