హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అత్యవసర సహాయం కోసం వచ్చే ఫోల్కాల్స్లో 0.28% మాత్రమే నిజమైన అత్యవసర కాల్స్ ఉంటున్నాయి. రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ పరిధిలోని డయల్ 112, డయల్ 100 నంబర్లకు రోజుకు సగటున 16 లక్షల కాల్స్ వస్తుండగా.. 4,500 కాల్స్ మాత్రమే నిజమైనవి కావడంతో వీటిపైనే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
నకిలీ, అనవసర కాల్స్‌ను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.