4 రాష్ట్రాలు.. 6% ఓట్లు.. జాతీయ పార్టీగా గుర్తింపునకు కనీస అర్హత
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి బీఆర్ఎస్గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. అసలు జాతీయ పార్టీ అంటే ఏమిటి? ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి తేడా ఏమి టి? ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది
- పార్టీల గుర్తింపుపై ఈసీ నిబంధనలు సుస్పష్టం
- పార్టీ గుర్తింపులో ఓటింగ్ శాతమే కీలకం
(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ)
హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి బీఆర్ఎస్గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. అసలు జాతీయ పార్టీ అంటే ఏమిటి? ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి తేడా ఏమి టి? ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏయే నిబంధనలు అనుసరించాలన్న దానిపై ఎన్నికల కమిషన్ ఏం చెప్తున్నదో పరిశీలిద్దాం.
మూడు మార్గాలు..
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. ఈ క్రింది మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తిచేయాలి.
1. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు గెలువాలి.
2. ఏవైనా నాలుగు రాష్ర్టాల నుంచి 11 లోక్‌సభ సీట్లు (రెండు శాతం సీట్లు) సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం మూడు రాష్ర్టాల నుంచి ఎన్నికవ్వాలి.
3. కనీసం నాలుగు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకొనే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు.
హోదా శాశ్వతం కాదు
జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే ఆ హోదా శాశ్వతంగా ఉండదు. ఎన్నికల తరవాత ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి హోదా ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. ఈ కారణంగానే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య తరుచూ మారుతున్నది.
ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ కింది నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పాటించాలి.
- రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి.
- ఆ రాష్ర్టంలో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతోపాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.
- ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.
- ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.
- లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై, చెల్లిన ఓట్లలో 8% వచ్చి ఉండాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

