Election Code | మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్వానాయ్ని పోలీసులు శుక్రవారం తనిఖీ చేశారు. మంత్రి మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభ అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్‌ని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులకు మంత్రి సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న నేతలకు చెందిన వాహనాల్లోనూ సోదాలు నిర్వహించారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.