Election Code | నల్గొండలో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టివేత : ఎస్పీ చందనా దీప్తి
Election Code | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు.
Election Code | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
సోమవారం ఉదయం 11.30 గంటల సమయములో మిర్యాలగూడ పట్టణంలో ఈదులగూడ చౌరస్తా వద్ద మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు ఆధ్వర్యంలో పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో రూ.5.73కోట్ల బంగారాన్ని గుర్తించారు. బంగారం, వ్యాన్‌తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

