మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్10: కోతుల దాడిలో ఓ వృ ద్ధుడికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం ధూళిమిట్ట మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. తుషాలపురం మల్లయ్య తన ఇంట్లో కూతురు, మనుమరాలుతో ఉండగా కోతులు ఒక్కసారిగా మల్లయ్యపై దాడిచేశాయి. గమనించిన స్థానికులు కోతుల ను కర్రలు, రాళ్లతో తరిమారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన మల్లయ్యను నంగునూరు సర్కారు దవాఖానకు తరలించి.. అక్కడ నుంచి సిద్దిపేట సర్కారు దవాఖానకు తరలించారు.