కొండెక్కిన కోడిగుడ్డు

- హోల్‌సేల్‌లో 6.. మార్కెట్లో 6.50 నుంచి 7
- ఈ నెలలోనే రూ.1.57 పెరిగిన ధర
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది. కోడిగుడ్డు ధర రోజురోజుకూ కొండెక్కుతున్నది. ఈ నెల మొదటివారంలో రైతువద్ద గుడ్డు లిప్టింగ్ ధర రూ.3.67 ఉంటే.. ప్రస్తుతం రూ.5.18గా ఉన్నది. హోల్‌సేల్ వ్యాపారులకు రూ.6 పడుతుండగా.. వినియోగదారులకు చేరే సరికి రూ.6.50 నుంచి రూ.7 అవుతున్నది. నెల రోజుల్లోనే గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు
వాతావారణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో ఉత్పత్తి తగ్గుతున్నది. ఈ నెలలో ఉత్పత్తి దాదాపు 75 శాతం క్షీణించిందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) ప్రతినిధులు అంటున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గినా లేదా పెరిగినా కోళ్లు తట్టుకునే శక్తిని పెంచుకోగలవని.. కానీ ఒక్కసారిగా హెచ్చుతగ్గులు నమోదైతే ఇబ్బందిగా మారుతుందని చెప్తున్నారు. మార్కెట్లో చికెన్, మటన్ ధరలు పెరుగుతుండటం కూడా గుడ్డు ధర పెరగడానికి కారణమవుతున్నది. మరోవైపు మహారాష్ట్రలో వైరస్ విజృంభిస్తుండటంతో తెలంగాణ గుడ్లకు అక్కడ డిమాండ్ ఎక్కువ కావడం కూడా మరో కారణమని పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మన దగ్గరే తక్కువ
దేశంలోని చాలా ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గుడ్డు ధర చాలా తక్కువగా ఉంది. కోల్‌కతాలో గుడ్డు లిప్టింగ్ ధర రూ.6.05, ఢిల్లీలో రూ.5.45, ముంబైలో రూ.5.77, చెన్నైలో రూ.5.35, అలహాబాద్‌లో రూ.5.67, ఏపీలోని విశాఖపట్నంలో రూ.5.57, చిత్తూరులో రూ.5.28గా ఉన్నది. తెలంగాణలో రెండో పెద్ద నగరం వరంగల్ సర్కిల్లో గుడ్డు ధర రూ.5.22 కూడా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువగానే ఉండటం గమనార్హం.
దాణా ధరలు భారీగా పెరిగాయి
గతంతో పోలిస్తే దాణా ధరలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు రూ.1,400 ఉన్న 40 కిలోల దాణా బస్తా ఒక్కసారిగా రూ.2,149కి పెరిగింది. దీంతో గుడ్డు ధర పెంచక తప్పని పరిస్థితి. ధరలు పెరగడంతో చాలామంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయడం లేదు. సాధారణంగా రోజుకు రాష్ట్రంలో 3.2 కోట్ల గుడ్లు ఉత్పత్తి కావాల్సి ఉండగా, ప్రస్తుతం అది 3 కోట్ల లోపే ఉంటున్నది.
సంజీవ్ చింతావర్, నెక్
గత పదిరోజులుగా హైదరాబాద్‌లో గుడ్డు లిప్టింగ్ ధర
తేదీ ధర
18 4.57
19 4.60
20 4.65
21 4.70
22 4.82
23 4.95
24 5.05
25 5.12
26 5.16
27 5.18
28 5.18
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

