కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ కలెక్టర్ బీ గోపి, పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడును బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఈ ఇద్దరు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చిం ది. బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి రానుండడంతో విధుల్లో ఉన్న ఆ ఇద్దరు ఆకస్మికంగా విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌కి, సీపీ డీసీపీకి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.