కోలుకున్నా.. కొనసాగించాల్సిందే!

- కోలుకున్నా.. కొనసాగించాల్సిందే!
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంటున్నది. పాజిటివ్ వచ్చినవారిలో దాదాపు 80 శాతం మంది టెలికన్సల్టేషన్ సూచనలతో ఇంట్లోనే కోలుకుంటున్నారు. కొద్దిగా సీరియస్‌గా ఉన్నవారు వైద్యుల సంరక్షణలో వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. కాగా, కొవిడ్ నుంచి రికవరీ అయ్యాక కూడా కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. తీవ్ర లక్షణాలతో పాజిటివ్ వచ్చినవారు నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివారు కొన్నిజాగ్రత్తలు పాటిస్తే కొవిడ్ అనంతరం జీవితం సాఫీగా సాగుతుందని నిపుణులు చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం
- రోజూ తప్పకుండా పండ్లు తీసుకోవాలి. దానిమ్మ, నారింజ, యాపిల్, బొప్పాయి ఇమ్యూనిటీ పెంచడంలో కీలకపాత్ర వహిస్తాయి. జూస్ తాగినా అలసట, నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వేసవిలో సహజంగానే తరుచూ దప్పిక అవుతుం ది. ఈ సమయంలో కొవిడ్పేషెంట్లు శరీరంలో వాటర్ లెవల్స్ పడిపోకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. తగినమోతాదులో గోరు వెచ్చటి నీళ్లు తీసుకోవాలి. లేదంటే శరీరం డీహైడ్రేట్ అయ్యి తరుచుగా అలసట బారినపడాల్సి వస్తుంది. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ ఉండాలి.
- కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉదయం లేవగానే వెజిటబుల్ జ్యూస్ తాగితే శక్తి వస్తుంది. లంచ్, డిన్నర్లో విభిన్నరకాల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, టమా టా, బీట్రూట్, ముల్లంగి జ్యూస్‌లను తాగాలి. వీటిలో మినరల్స్, విటమిన్లు.
- కరోనా తర్వాత జీర్ణవ్యవస్థ సాధారణస్థాయికి రావడానికి సమయం పడుతున్నందున తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. శరీరం బలహీనంగా ఉండటం వల్ల ఘనపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
- కరోనా నుంచి కోలుకున్నాం కదా అని ఆవిరి పీల్చడం ఆపివేయద్దు. ఆవిరి పీల్చడంవల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
- నెగెటివ్ వచ్చిందని మల్టీవిటమిన్లు, సీ, జింక్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వెంటనే మానేయకూడదు. వీటిని అనంతరం కొద్దిరోజులు తీసుకోవాలి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపించడం లో దోహదపడుతాయి. విటమిన్-సీ, విటమిన్-డీ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అవి ఆహారం రూపంలో లభించని పక్షంలో వైద్యుల సూచనలతో విటమిన్ ట్యాబ్లెట్స్ కొనసాగించాలి.
- ఎక్కువగా శారీరక శ్రమ చేయకూడదు. తగినంత నిద్ర, విశ్రాంతి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- తరుచూ ఆక్సిజన్ లెవల్స్ పరిశీలించుకోవాలి. నెగెటివ్ వచ్చాక కొద్దిరోజులు భౌతిక దూరం పాటించడం మంచిది. మాస్క్ తప్పకుండా ధరించి ఉండాలి. వ్యాయామం కొనసాగించాలి.
- వైరస్ ఊపిరితిత్తులను అటాక్ చేశాక ఇన్ఫెక్షన్ తగ్గడానికి సమయం పడుతుంది. అలాంటి వారు బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే త్వరగా ఉపశమనం పొందుతారు. మెడిటేషన్, యోగా చేయాలి.
తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి
ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పాలల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకునేముందు పాలు తాగాలి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. చేపలు, గుడ్లు కూడా తీసుకోవచ్చు. మంచి ఆహారంతోపాటు మానసికంగా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.
- సనాఫాతిమ, పోషకాహార నిపుణులు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

