TSCHE | ఎంసెట్, లాసెట్‌కు అత్యధికంగా దరఖాస్తులు.. అత్యల్పంగా పీఈసెట్‌కు..
TSCHE | తెలంగాణ ఉన్నత విద్యామండలి 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటీఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆయా కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు.
TSCHE | తెలంగాణ ఉన్నత విద్యామండలి 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటీఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆయా కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంసెట్( EAMCET ), లాసెట్( LAWCET ) కోర్సులకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా పీఈసెట్( PECET )కు మాత్రమే వచ్చాయి.
ఎంసెట్‌కు 2,66,680 మంది దరఖాస్తు చేసుకోగా, లాసెట్‌కు 24,583 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసెట్( ECET )కు 15,285 మంది, ఐసెట్( ICET )కు 20,150, పీజీఈసెట్( PGECET )కు 3,846, ఎడ్‌సెట్( EdCET )కు 8,820, పీఈసెట్‌కు 616 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
చివరి తేదీలు ఇలా..
ఎంసెట్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 10 కాగా, ఈసెట్‌కు మే 2, ఐసెట్‌కు మే 6, పీజీఈసెట్‌కు ఏప్రిల్ 30, లాసెట్‌కు ఏప్రిల్ 20, ఎడ్‌సెట్‌కు ఏప్రిల్ 20, పీఈసెట్‌కు మే 6 చివరి తేదీ.
ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
- ఎంసెట్ – అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ విద్యార్థులకు మే 12 నుంచి 14 తేదీల మధ్యలో ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు.
- ఈసెట్ ప్రవేశ పరీక్ష మే 20న, ఐసెట్ ఎగ్జామ్‌ను మే 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.
- పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
- లాసెట్ ఎగ్జామ్‌ను మే 25న, ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను మే 18న, పీఈసెట్‌ను జూన్ 1 నుంచి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

