e-pass must: ఏపీ సరిహద్దుల్లో ఆంక్షలు కఠినతరం..
ఆంక్షలు కఠినతరం| ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరని, లాక్డౌన్ మినహాయింపు సమయంలో కూడా ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

నల్లగొండ: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరని, లాక్డౌన్ మినహాయింపు సమయంలో కూడా ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లకు, ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ-పాస్ లేని వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ, రామాపురం వద్ద, నల్లగొండ జిల్లా వాడపల్లి, నాగార్జునసాగర్‌ల వద్ద రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు చేక్ పోస్టుల వద్ద ఈ-పాస్‌లేని వాహనాలను అడ్డుకుంటున్నారు.

దీంతో సరిహద్దుల్లో ఉదయం నుంచి ఆంధ్ర ప్రాంతం వైపు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అలాగే మేల్లచెరువు, చితలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో ఉన్న ఆంధ్ర-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దుల్లో అత్యవసర సేవలు మినహాయించి ఇతర సాధారణ రాకపోకలను 24 గంటలు నిషేదిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ ప్రకటించారు. కొంత మంది వాహనదారులు, ప్రజలు లాక్డౌన్ మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారని, అలాగే ఆంధ్రా నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఉదయం 4 నుంచి 6 గంటలోపు రామాపురం ఎక్స్‌రోడ్ అంతరాష్ట్ర చెక్ పోస్టుకు చేరుకుటున్నారని, 6 గంటల తర్వాత తెలంగాణలోకి వస్తున్నారని చెప్పారు. దీంతో వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున ఆంక్షలను కఠినతరం చేశామన్నారు. రాష్ట్రంలోకి రావాలంటే ఏసమయంలోనైనా ఈ-పాస్ ఉండాలని తెలిపారు. దీనిని ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

