సారీ! హైదరాబాద్‌కు డ్రగ్స్ పంపం
డ్రగ్స్‌పై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు చేస్తున్న ఆపరేషన్లతో డ్రగ్స్ సరఫరాదారులకు చెమటలు పడుతున్నాయి. చిన్న ఆధారం దొరికినా, మూలాలను కూడా కదిలిస్తుండటంతో హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడాలంటే గజగజ వణికిపోతు
ప్లేసూ డేంజరే.. పోలీసులూ డేంజరే
భయంతో వణుకుతున్న డ్రగ్స్ స్మగ్లర్లు
‘ఆపరేషన్ వైట్ పౌడర్’లో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్‌పై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు చేస్తున్న ఆపరేషన్లతో డ్రగ్స్ సరఫరాదారులకు చెమటలు పడుతున్నాయి. చిన్న ఆధారం దొరికినా, మూలాలను కూడా కదిలిస్తుండటంతో హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడాలంటే గజగజ వణికిపోతున్నారు. గోవా, ముంబైలో ఉంటూ నగరానికి డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ ముఠాలు.. ఇక్కడికి మత్తు పదార్థాలు సరఫరా చేయాలంటే వెనకడుగు వేస్తున్నాయి. తాజాగా, సైబరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ వైట్ పౌడర్’ పేరుతో డ్రగ్స్ కావాలంటూ గోవాలో ఉంటున్న నైజీరియాకు చెందిన ఓ డ్రగ్స్ స్మగ్లర్‌కు ఫోన్ చేయగా, అతడు.. దేశంలో ఏ రాష్ర్టానికైనా సరఫరా చేస్తాం కానీ హైదరాబాద్‌కు తీసుకురాలేమని తేల్చిచెప్పాడు.
గంజాయి స్మగ్లర్లలోనూ ఇదే భయం నెలకొన్నది. అటు.. పబ్‌లు, ఫాంహౌజ్‌లు, రిసార్టులు, హోటల్స్ నుంచి రోజూవారీ సమాచారాన్ని పోలీసులు తెలుసుకొంటున్నారు. పలు స్టార్ హోటళ్లపైనా డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో చిన్న కాగితం ముక్క దొరికినా నిశితంగా పరిశీలిస్తున్నారు. నిఘా, సోదాలు, సమాచార సేకరణలో కఠినంగా వ్యవహరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొంటున్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం సైబరాబాద్ పోలీసులు రెండు ఫాంహౌజ్‌లపై దాడి చేసి, హుక్కా పాట్లను స్వాధీనం చేసుకొన్నారు. పార్టీలు నిర్వహిస్తున్నవారిపై కేసు బుక్ చేశారు.
పోలీసుల డెకాయ్ ఆపరేషన్.. ‘ఆపరేషన్ వైట్ పౌడర్’:
హైదరాబాదీ: నాకు 10 గ్రాముల కొకైన్ కావాలి, డెలివరీ చేయగలరా?
నైజీరియన్: ఓకే, లొకేషన్ చెప్పండి
హైదరాబాదీ: హైదరాబాద్‌కు డెలివరీ చేయాలి
నైజీరియన్: హో.. అక్కడికి డెలివరీ చేయలేం. వేరే లొకేషన్ చెప్పండి. హైదరాబాద్ చాలా డేంజర్, అక్కడి పోలీసులు కూడా. వేరే రాష్ట్రం ఏదైనా సరే, హైదరాబాద్ తప్ప.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

