నారాయణపేట జిల్లా వడ్వాట్లో తాగునీటి కష్టాలు
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరాకాకపోవడంతో గ్రామస్తులు దాహంతో అలమటిస్తున్నారు. సమీపంలోని బోర్లు.. వ్యవయసాయ బోర్ల వద్దకు వెళ్లి బిందెలు, క్యాన్లతో నీటిని తెచ్చుకుంటున్నారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరాకాకపోవడంతో గ్రామస్తులు దాహంతో అలమటిస్తున్నారు. సమీపంలోని బోర్లు.. వ్యవయసాయ బోర్ల వద్దకు వెళ్లి బిందెలు, క్యాన్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. తాగునీటి సమస్య నెలకొన్నా ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మిషన్ భగీరథ ఏఈని వివరణ కోరగా నీటిని సరఫరా చేసే మోటర్లు కరెంట్ లోవోల్టేజ్ కారణంగా కాలిపోతున్నాయని, పైప్లైన్ లీకేజీలు ఏర్పడుతున్నాయని, దీంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నదని వెల్లడించారు.
– మాగనూర్
పొలాల్లో రైతుల నిరసన
రంగనాయకసాగర్ జలాశయం నుంచి సాగునీరు ఇవ్వకపోవడంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపూర్, చంద్లాపూర్, విఠలాపూర్, రామంచ గ్రామాల్లోని వేలా ది ఎకరాల వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయని రైతులు ఆవేదన చెందారు. శుక్ర వారం గంగాపూర్లో రైతులు ఎండిపోతున్న వరి పొలాల్లో దిగి నిరసన తెలిపారు.
-చిన్నకోడూరు
ఎండిన పొలం.. పశువుల పాలు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల శివారులో రైతు చందు నాయుడుకు చెందిన ఎండిన వరి పంటను మేస్తున్న పశువులు
– పెద్దమందడి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

