సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
సీఎం ఇలాకా కొడంగల్‌లో అభివృద్ధి పేరుతో సాగుతున్న పనుల్లో సమన్వయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా మూడు రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయి అనేక కష్టాలు పడుతున్నారు.
- ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన గాంధీనగర్ వాసులు
- మిషన్ భగీరథ పైపులు పగిలి నిలిచిన నీటి సరఫరా
- ఏడాదైనా పనులు పూర్తికాకపోవడంపై జనాగ్రహం
- అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పేరిట ఎక్కడికక్కడ తవ్వకాలు
- మట్టి, బురద దారుల్లో నడువలేక ప్రజల ఇక్కట్లు
కొడంగల్, అక్టోబర్ 11 : సీఎం ఇలాకా కొడంగల్‌లో అభివృద్ధి పేరుతో సాగుతున్న పనుల్లో సమన్వయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా మూడు రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయి అనేక కష్టాలు పడుతున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా సీసీరోడ్లను తవ్వేయడంతో మట్టి, బురదమయమై నడువలేకపోతున్నామని, కొన్ని చోట్ల పైప్లైన్లు దెబ్బతిని తాగునీటికి కష్టమవుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం వీధుల్లో ఇదివరకు వేసిన సీసీరోడ్లను పూర్తిగా తవ్వేశారు. పనులు చేస్తున్న క్రమంలో అక్కడక్కడా మిషన్ భగీరథ పైప్లైన్లు తొలగిస్తున్నారు. వాటికి వెంటనే మరమ్మతులు చేయడం లేదు. దీని వల్ల రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోతున్నది.
గాంధీనగర్ వీధిలో పైప్‌లైన్ తెగి మూడు రోజులుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పనులు ప్రారంభించి దాదాపు ఏడాది గడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. వీధిలో కనీసంగా బోర్‌పంప్ కూడా లేదని, కనీసం ట్యాంకర్ల ద్వారా నీటిని కూడా సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయా వార్డుల్లో పనులు వెంటనే పూర్తిచేసి మరో వార్డులో చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండేదని, కానీ కాంట్రాక్టర్ ఉన్న వీధుల్లో పనులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుస్తున్నది. అభివృద్ధి పనుల్లో శాఖల మధ్య సరైన అవగాహన లేక ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని, పైప్‌లైన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించకుండా తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తాగునీరు, కరెంటుకు ఎలాంటి సమస్య లేదని గుర్తుచేసుకున్నారు.
ప్రజలకు నీళ్లివ్వడమూ చేతకాదా?
సొంత నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీళ్లు ఇవ్వడం చేతకాని రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలోని ప్రజల కష్టాలను ఎలా తీరుస్తాడు. వార్డుల్లో అడ్డగోలుగా చేసే పనుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పడం కాదు, వారి సమస్యలేమిటో చూడాలి.
– పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడంగల్
తాగునీళ్లు రావడం లేదు..
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తున్నప్పుడు మిషన్ భగీరథ తాగునీటి పథకం పైప్లైన్లు అక్కడక్కడా తొలగిస్తున్నారు. వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రెండు, మూడు రోజులుగా తాగునీళ్లు రావడం లేదు. ఆయా శాఖలు సమన్వయంతో పనులు చేసి సమస్యలు పరిష్కరించాలి.
– జగన్, గాంధీనగర్ వాసి
ఈ కష్టాలు ఇంకెంతకాలం
ఇంకెన్నాళ్లీ తవ్వకాలు చేపడతారు. తవ్విన వెంటనే పనులు పూర్తి చేస్తే ఎవరికీ సమస్య ఉండదు. చిన్న పాటి వీధులు కావడంతో నడువలేకపోతున్నం. పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నరు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మంచిదే కానీ ఇలా ఆలస్యం చేయడం బాగాలేదు. వెంటనే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– శివకుమార్, గాంధీనగర్వాసి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

