రంగు నీళ్లలో వేస్తే డబ్బులు డబుల్.. 33 లక్షలతో రాత్రికి రాత్రి బిహార్ ముఠాపరార్
బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ దగ్గర మహిమగల రంగు నీళ్లు ఉన్నాయని, అందులో రాత్రి డబ్బులు వేస్తే తెల్లారే సరికి డబుల్ అవుతాయని చెప్పి నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన ఒకరికి ద్వారా అదే గ్రామానికి చెందిన అతడి బావను న మ్మించారు.
నీలగిరి, జూన్ 24 : బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ దగ్గర మహిమగల రంగు నీళ్లు ఉన్నాయని, అందులో రాత్రి డబ్బులు వేస్తే తెల్లారే సరికి డబుల్ అవుతాయని చెప్పి నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన ఒకరికి ద్వారా అదే గ్రామానికి చెందిన అతడి బావను న మ్మించారు. దాంతో ఆయన శనివారం రూ.33 లక్షలను అప్పు చేసి తెచ్చి ఈ ముఠాకు అప్పజెప్పాడు. వాళ్లు ఆ డబ్బులను రంగు నీళ్ల బిందెల్లో పెట్టి ఉంచారు.
ఆదివారం ఉదయం వరకు రెట్టింపవుతాయని చెప్పారు. తాము ఇక్కడే ఉంటామని, ఆ బిందెలను ముట్టుకోవద్దని చెప్పి అర్ధరాత్రి రూ.33 లక్షలతో ఉడాయించా రు. ఆదివారం ఉదయం ఆ బిందెలను చూడగా.. ఖాళీగా ఉండడంతో బాధితుడు నల్లగొండ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు టెక్నాలజీ సాయంతో ముగ్గురి సభ్యుల ముఠాలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, రూ.20 లక్షల వరకు వరకు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

