DOST | దోస్త్ షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
DOST | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మే 29న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6వ తేదీలోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సెకండ్ ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 13న రెండో దశ సీట్లు కేటాయించనున్నారు. జూన్ 13 నుంచి 18వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
థర్డ్ ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 13 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనుంది. రిజిస్ట్రేషన్‌కు రూ. 400 చెల్లించాలి. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్ 23న సీట్ల కేటాయింపు జరగనుంది. జూన్ 23 నుంచి 28 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

