DOST | దోస్త్ ఫస్ట్ ఫేజ్‌లో 76,290 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు
DOST | డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1లో 76,290 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
DOST | హైదరాబాద్ : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1లో 76,290 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఆర్ట్స్ గ్రూపుల్లో 7,766 మందికి, కామర్స్ గ్రూపుల్లో 28,655, లైఫ్ సైన్సెస్ గ్రూపుల్లో 15301, ఫిజికల్ సైన్సెస్ గ్రూపుల్లో 14964, డేటా సైన్స్ గ్రూపుల్లో 2502, డీ ఫార్మసీ గ్రూపుల్లో 90, ఇతర గ్రూపుల్లో 7012 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఫేజ్-1లో మొత్తం 1,04,784 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,066 డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో 4,49,449 సీట్లున్నాయి. వీటిలో 135 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 86 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలున్నాయి. నిరుడు 3,89,049 సీట్లుంటే 2.05లక్షల సీట్లు నిండాయి. ఈ ఏడాది నాలుగు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన సెక్టార్ స్కిల్ కోర్సులను పలు కాలేజీల్లో విస్తరించారు. ఈ ఏడాది జూలై 8 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

