కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘించి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాధన్నపేట గ్రామంలో ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు.
- ప్రారంభోత్సవాలు చేసిన ప్రజాప్రతినిధులు, నేతలు
- మాధన్నపేటలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
- ఎలుకుర్తి గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
- పట్టించుకోని అధికారులు
నర్సంపేట/గీసుకొండ, నవంబర్ 28: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘించి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాధన్నపేట గ్రామంలో ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు.
మరోవైపు గీసుగొండ మండలం ఎలుకుర్తిలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగేలా రేవూరి ప్రసంగించారు. దశల వారీగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

