హరేకృష్ణ మూవ్మెంట్ సేవా కార్యక్రమాలకు తోడ్పాటుగా హైదరాబాద్కు చెందిన శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం భూరి విరాళాన్ని అందించింది. ఎంపోరియం ఎండీ సంజయ్ సింఘానియా, డైరెక్టర్ రవికాంత్ సింఘానియా రూ.12.60 లక్షల చెక్కును బుధవారం ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభుజీకి అందజేశారు.