అసెంబ్లీలో దొడ్డి కొమురయ్య వర్ధంతి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని శాసనసభాప్రాంగణంలో గురువారం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్,
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని శాసనసభాప్రాంగణంలో గురువారం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఎల్పీ కార్యదర్శి శ్రీకాంత్, చీఫ్ మార్షల్ కరుణాకర్, శాసనమండలి, శాసనసభ ఉద్యోగులు పాల్గొన్నారు.
నేడు రాష్ర్టానికి జస్టిస్ పీసీ ఘోష్
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే విచారణ ప్రారంభించిన ఆయన గత నెల 6 నుంచి 16 వరకు ఇక్కడే ఉండి ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించారు. కమిషన్ ఎదుట వెల్లడించిన అభిప్రాయాలను అఫిడవిట్ల రూపంలో జూన్ 28లోగా దాఖలు చేయాలని ఆదేశించారు. గడువు ముగిసిపోగా తదుపరి విచారణ ప్రక్రియను కొనసాగించేందుకు ఘోష్ రాష్ర్టానికి వస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

