ఖైరతాబాద్, జూన్ 27: పీఎం కుసుమ్ (కాంపోనెంట్-ఏ) కింద సోలార్ ప్లాంట్ల విద్యుత్తు టారిఫ్‌ను తగ్గించొద్దని, ప్లాంట్ల లబ్ధిదారులైన రైతులకు అన్యాయం చేయొద్దని తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిన సోలార్ విద్యుత్తు టారిఫ్‌ను పెంచాలనే డిస్కమ్‌ల యోచనను నిరసిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 300మంది రైతులు, పీపీఏ హోల్డర్లు శనివా రం ఖైరతాబాద్‌లోని ఇంజినీర్స్ భవన్లో స మావేశమయ్యారు. రైతులు ఉత్పత్తిచేసిన సో లార్ విద్యుత్తును డిస్కమ్‌లకు విక్రయించేందుకు ఖరారు చేసిన టారిఫ్‌ను తగ్గిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. పాత టారిఫ్‌నే కొనసాగించాలని ముక్తకంఠంతో నినదించారు. పీపీఏ కుదుర్చుకొన్నాక టారిఫ్‌ను ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. డిస్కమ్‌ల పిటిషన్‌ను ఈఆర్సీ తిరస్కరించాలని, పాత టారిఫ్‌నే కొనసాగిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. వాస్తవ ప్రాజెక్టు వ్యయాలపై అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు.