హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ విశాఖలో పర్యటిస్తుండటంతో స్టీల్ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. స్టీల్ నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని డిమాండ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు శుక్రవారానికి 638వ రోజుకు చేరాయి.
‘సేవ్ వైజాగ్ స్టీల్, విశాఖ ఉకు..ఆంధ్రుల హకు’ అంటూ నిరసన తెలిపారు. కాగా, స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళనలను పోలీసులు అడ్డుకొన్నారు. మోదీ రాక సందర్భంగా స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. కార్మికుల నిరాహారదీక్షలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వివిధ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.