గొర్రెల పంపిణీకి గుండు సున్నా
గొర్రెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. ఇప్పటికే లబ్ధిదారులు చెల్లించిన డీడీలను తిరిగి ఇచ్చేస్తుండగా, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసినట్టేననే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పాల ఉత్పత్తికి అనుగుణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా డెయిరీని నిర్మించింది.
- విజయ మెగా డెయిరీకీ రూపాయి లేదు
- చేపల పంపిణీకి అంతంతే నిధులు
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. ఇప్పటికే లబ్ధిదారులు చెల్లించిన డీడీలను తిరిగి ఇచ్చేస్తుండగా, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసినట్టేననే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పాల ఉత్పత్తికి అనుగుణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా డెయిరీని నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డెయిరీ మెయింటనెన్స్‌కు నిధులు కేటాయించకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి రూ.100 కోట్లు అవసరం కానుండగా రూ.20 కోట్లే కేటాయించింది. మత్స్యకారుల ఇన్సూరెన్స్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వెటర్నరీ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనలోనూ వివక్ష చూపించింది. సిద్దిపేట కాలేజీకి నయా పైసా కేటాయించని ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్ వెటర్నరీ కాలేజీకి రూ. 6.50 కోట్లు కేటాయించింది. పెబ్బేరులోని షిషరీస్ కాలేజీకి పైసా కేటాయించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

