Double bedroom house | గ్రేటర్లో రేపే ‘డబుల్’ పండుగ.. ఒకేరోజు 11,700 మంది లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ
అగ్గిపెట్టె లాంటి రేకుల షెడ్డు. అందులో ఒకే ఒక్క గది. దానికి అద్దె నెలకు రూ.3-4 వేలు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చే ఆదాయంలో సగభాగాన్ని అద్దెకే చెల్లించినా యజమాని ఎప్పుడు ఖాళీ చేయమంటాడో తెలియదు. క్షణక్షణం భయపడుతూ జీవించాల్సిందే.
- తొమ్మిది చోట్ల లాటరీ ప్రాతిపదికన పంపిణీకి ఏర్పాట్లు
- మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్ చేతుల మీదుగా పంపిణీ
- నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
Double bedroom house | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): అగ్గిపెట్టె లాంటి రేకుల షెడ్డు. అందులో ఒకే ఒక్క గది. దానికి అద్దె నెలకు రూ.3-4 వేలు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చే ఆదాయంలో సగభాగాన్ని అద్దెకే చెల్లించినా యజమాని ఎప్పుడు ఖాళీ చేయమంటాడో తెలియదు. క్షణక్షణం భయపడుతూ జీవించాల్సిందే. ఇదీ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటు నిరుపేద పరిస్థితి. అలాంటి నిరుపేదలకు సొంతిల్లు సాధ్యమా? రెండు పడకలతో బహిరంగ మార్కెట్లో రూ.30-40 లక్షల విలువచేసే పక్కా ఇల్లు తమ సొంతమవుతుందని వారు కలలోనైనా ఊహించగలరా? అలాంటి అసాధ్యాన్ని తెలంగాణ సర్కారు సుసాధ్యం చేసింది. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు పంపిణీ చేసే సుముహూర్తం రానే వచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ మహా క్రతువును వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు వేల డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణం పూర్తయిన దాదాపు 70 వేల ఇండ్లను అర్హుల పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా 24 నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు శనివారం ఒక్కరోజే 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి 9 ప్రాంతాల్లో లాటరీ ద్వారా ఇండ్లను కేటాయించనున్నారు. ఏడుగురు రాష్ట్ర మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చేతుల మీదుగా ఈ ఇండ్ల పంపిణీ జరుగుతుంది.
ఎవరు ఎక్కడ పంపిణీ చేస్తారంటే..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ 1,700 గృహాలను పంపిణీ చేస్తారు. గాజుల రామారంలో నిర్మించిన 144, బహదూర్‌పల్లిలో నిర్మించిన 356 ఇండ్లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ లబ్ధిదారులకు.. డీ-పోచంపల్లిలో నిర్మించిన 1,200 గృహాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 200 మంది, సనత్‌నగర్ నియోజకవర్గంలోని 500 మంది, కూకట్పల్లి నియోజకవర్గంలోని 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
బండ్లగూడలో నిర్మించిన 270 గృహాలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గ లబ్ధిదారులకు, ఫారూఖ్‌నగర్‌లో నిర్మించిన 770 గృహాలను బహదూర్‌పుర నియోజకవర్గ లబ్ధిదారులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు.
నార్సింగి, బైరాగిగూడ-2 ప్రాంతంలో నిర్మించిన 160 ఇండ్లతోపాటు నార్సింగి సర్వే నంబర్ 117లో నిర్మించిన 196 గృహాలను రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
నల్లగండ్ల సర్వేనంబర్ 125లో నిర్మించిన 216 గృహాలతోపాటు, సాయినగర్ హఫీజ్‌పేటలో నిర్మించిన 168 ఇండ్లను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-1, అమీన్పూర్-2లో నిర్మించిన 3,300 గృహాలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేయనున్నారు. కొల్లూరు-1లో నిర్మించిన 1,500 ఇండ్లను ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 200 మందికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 156 మందికి, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన 144 మందికి, పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన 500 మందికి పంపిణీ చేస్తారు. అమీన్పూర్-2లో నిర్మించిన 1,800 ఇండ్లను గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, నాంపల్లి నియోజకవర్గానికి చెందిన 500 మందికి, కార్వాన్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, ఖైరతాబాద్‌కు చెందిన 300 మందికి అందజేయనున్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడలో నిర్మించిన 1,500 ఇండ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేయనున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన 500 మందికి, ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు ఈ గృహాలను పంపిణీ చేయనున్నారు.
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీనగర్ కాలనీ సర్వే నంబర్ 710/పీలో నిర్మించిన 500 గృహాలను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ పంపిణీ చేయనున్నారు. వీటిని ఉప్పల్ నియోజకవర్గ లబ్ధిదారులకు అందజేయనున్నారు.
మేడ్చల్ పరిధిలోని ప్రతాప్సింగారంలో వెయ్యి ఇండ్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు పంపిణీ చేయనున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, అంబర్‌పేటకు చెందిన మరో 500 మందికి ఈ గృహాలను అందజేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

