హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు మంజూరుచేసే వార్షిక స్కూల్ గ్రాంట్, స్పోర్ట్స్ గ్రాంట్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2023 -24 విద్యాసంవత్సరానికి రూ.34.09 కోట్లు స్కూల్ గ్రాంట్, రూ.8.22 కోట్ల స్పోర్ట్స్ గ్రాంట్‌ను 50శాతం మేరకు రిలీజ్ చేస్తూ సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠశాలల్లో చాక్‌పీసులు కొనాలన్నా.. విద్యుత్తు బిల్లులు చెల్లించాలన్నా, పంద్రాగస్టుకో, 26 జనవరికో స్వీట్లు పంపిణీ చేయాలన్నా ఈ నిధులనే ఉపయోగిస్తారు.