సీనియర్ సిటిజన్స్ లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్‌లు
ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకేరోజు రెండు ఘటనల్లో ఇద్దరు వృద్ధులు రూ. 1.57 కోట్లకుపైగా సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయారు. నేరెడ్మెట్ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగికి డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ప్రతినిధినంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
- ఇద్దరి నుంచి రూ. 1.57 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకేరోజు రెండు ఘటనల్లో ఇద్దరు వృద్ధులు రూ. 1.57 కోట్లకుపైగా సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయారు. నేరెడ్మెట్ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగికి డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ప్రతినిధినంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఆధార్, సిమ్‌కార్డు ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు, నకిలీ ఏటీఎంలు, బ్యాంక్ అక్రమ లావాదేవీలు జరిగాయని, ముంబై కొలాబా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని బెదిరించాడు.
మీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని, ఖాతాలో ఉన్న డబ్బును తాము సూచించిన ఖాతాలోకి పంపించాలని, విచారణ అనంతరం సొమ్ము తిరిగి వస్తుందని నమ్మించారు. వారి మాటలు నమ్మి బాధితుడు రూ. 68.8 లక్షలు వివిధ ఖాతాలకు బదిలీ చేసి మోసపోయాడు. మరో ఘటనలో అదే ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్‌నేరగాళ్లు మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ బెదిరించి రూ. 88.8 లక్షలు కాజేశారు. మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

