గిర్మాజీపేట, మే 28: వరంగల్ స్టేషన్‌రోడ్‌లోని పోస్టాఫీసు సమీపంలో నివాసముంటున్న కొండపర్తి రాజేంద్రకుమార్ తన ఇంట్లోకి కుక్క వచ్చిందని మంగళవారం ఉదయం 2 గంటలకు 100కు డయల్ చేశా డు. ఇంతెజార్గంజ్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రాజయ్య వచ్చి ఇంత అర్ధరాత్రి ఎం దుకు ఫోన్ చేశావని అడగ్గా.. కుక్కను బయటకు వెళ్లగొట్టడానికని బదులిచ్చాడు. కానిస్టేబుల్ కుక్కను ఇంటి నుంచి వెళ్లగొట్టి ఇలాంటి విషయాలకు 100 డయల్‌కు కాల్ చేయొద్దని సుతిమెత్తగా మందలించాడు.