కోమటిరెడ్డి కంపెనీలో కార్మికుల ధర్నా
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీలో రెండు నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదని కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓసీపీలో మట్టి తవ్వకాలు, రవాణా(ఓబీ) చేసే సుశీ హైటెక్ సంస్థ కార్మికులు వారం రోజులుగా విధులు బహిష్కరించారు
- వేతనాలు చెల్లించని సుశీ సంస్థ
- మట్టి రవాణాను అడ్డుకొని నిరసన
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 29: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీలో రెండు నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదని కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓసీపీలో మట్టి తవ్వకాలు, రవాణా(ఓబీ) చేసే సుశీ హైటెక్ సంస్థ కార్మికులు వారం రోజులుగా విధులు బహిష్కరించారు. దాదాపు 400 మంది కార్మికులు సంస్థ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. సింగాపూర్ ఓసీపీ ఓబీ మట్టి రవాణాను అడ్డుకొని ఆందోళన చేశారు. మేనేజర్ నాగభూషణాన్ని రెండు నెలల వేతనం రూ.2 కోట్లు, పండుగ బోనస్ ఇవ్వాలని అధ్యక్షుడు పెద్దపల్లి సురేశ్ డిమాండ్ చేశారు.
తొమ్మిది నెలలుగా పీఎఫ్ డబ్బులు కూడా యాజమాన్యం జమ చేయట్లేదని వాపోయారు. సుశీ సంస్థ యాజమాన్యం వేతనాలు ఇవ్వకుండా.. మునుగోడులో వందల కోట్లు ఖర్చు చేసి రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నదని మండిపడ్డారు. వెంటనే కాంట్రాక్టు కార్మికులకు సుశీ సంస్థ యజమాని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేతనాలు, బోనస్, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించకుంటే శ్రీరాంపూర్ ఓసీపీ నుంచి బొగ్గు ముక్క కూడా బయటికి పోనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

