Home
Telangana
Dharani Portal Give A New Option To Change Where Pattadar Name Is Entered As House Or House Site
ధరణి రికార్డుల్లో యజమాని పేరు తప్పుగా పడిందా? అయితే మీ కోసమే ఈ కొత్త ఆప్షన్

హైదరాబాద్ : ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు ఇల్లు/ ఇంటి స్థలం అని నమోదైన భూములపై వినతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూపెట్టకపోవడం లేదా అధికారుల తప్పిదం వల్ల కొన్ని సర్వే నంబర్లలోని భూములకు రైతు పేరుకు బదులుగా ‘ఇల్లు’ లేదా ‘ఇంటి స్థలం’ అని నమోదైంది. ఇలాంటి వాటిపై దరఖాస్తు చేసుకునేందుకు ధరణిలో ‘ఇష్యూ ఆఫ్ పీపీబీ ఆర్ నాలా కన్వర్షన్ వేర్ పట్టాదార్ నేమ్ ఈజ్ షోన్ యాజ్ హౌజ్/హౌజ్ సైట్’ అనే పేరుతో ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
- వెబ్సైట్లో నేరుగా లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పట్టాదారు వివరాలు, భూమి వివరాలు, పాత పాస్‌బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి యాజమాన్యాన్ని నిర్ధారించే పత్రాలు, ఆ భూమి ఫొటో లేదా వీడియోను జత చేయాలి.
- రైతులతోపాటు సంస్థలు కూడా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
- అప్లికేషన్ పూర్తి కాగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ చేయాలి. సొంతంగా దరఖాస్తు చేసుకునేవారు సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
- బయోమెట్రిక్ పూర్తయ్యాక దరఖాస్తు నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్తుంది. కలెక్టర్ దానిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించడం లేదా తిరస్కరించడం చేస్తారు.
- ఒకవేళ అనుమతి వస్తే వెంటనే ఈ-పట్టాదార్ పాస్‌బుక్ మంజూరవుతుంది. గ్రీన్ కలర్ పాస్‌బుక్‌ను పోస్టు ద్వారా నేరుగా ఇంటికి పంపుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

