మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 02:19:10

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
  • మావోయిస్టుల కదలికల నేపథ్యంలో
  • డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశం

ములుగు జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ములు గు జిల్లా కేంద్రంలోని పోలీస్‌కార్యాలయం లో రెండు జిల్లాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీస్‌ అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడారం జాతర నిర్వహణలో పోలీసు అధికారులు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. విచారణలో రాజీపడకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించారనే సమాచారం ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఓఎస్డీలు సురేశ్‌కుమార్‌, శోభన్‌కుమార్‌, గ్రేహౌండ్స్‌ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>