అధికారులను బలి పశువులను చేయొద్దు
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్తు సంక్షోభం, సాగునీటి ఎద్దడికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ప్రణాళిక లోపాలే ప్రధాన కారణమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిందిపోయి కరెంట్ ఉండదు, నీరు దొరుకదు, పంటలు వేయవద్దు అంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నదని ఆరోపించారు.
- టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్తు సంక్షోభం, సాగునీటి ఎద్దడికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ప్రణాళిక లోపాలే ప్రధాన కారణమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిందిపోయి కరెంట్ ఉండదు, నీరు దొరుకదు, పంటలు వేయవద్దు అంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నదని ఆరోపించారు.
ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే క్షేత్రస్థాయి అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. బొగ్గు సరఫరాను సమకూర్చాల్సిన బాధ్యతను గాలికొదిలేసి, ఉత్పత్తి తగ్గిందన్న సాకుతో వైటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ను సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని పేరొన్నారు. వ్యవస్థాగత వైఫల్యాలకు ఉద్యోగులను బలిచేసే ధోరణిని ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని, బొగ్గు సరఫరా, సాంకేతిక నిర్వహణ, ప్రణాళిక లోపాలపై నిష్పక్షపాత విచారణ జరిపి నిజమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

