హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad)లో నిర్మాణ రంగం(Construction sector) చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిర్మాణ రంగంలో గతంలో ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని కాంట్రాక్టర్లుగా చూడట్లేదని, వెల్తె క్రియేటర్లుగా చూస్తున్నామని చెప్పారు. నిర్మాణ రంగానికి అన్ని విధాల సహకరిస్తామిన డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.