గద్వాల/గద్వాల రూరల్, అక్టోబర్ 25 : జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. రుణమాఫీతోపాటు రైతుభరోసా చెల్లించాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌కు వినతిప త్రం అందజేసేందుకు రైతులు భారీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. రైతులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు మెయిన్ గేట్ వద్దే అడ్డుకోవడంతో అక్కడే ధర్నా చేపట్టారు. అనంతరం రైతులు గేట్‌ను తీసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. రైతులు భారీగా రావడంతో కలెక్టర్ సంతోష్ బయటకు వచ్చి వినతిపత్రం అందుకున్నారు. సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చ ర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.