ఆర్టీసీ బస్సు దగ్ధం.. ఇద్దరి పరిస్థితి విషమం
ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి సమీపంలోని ఎన్‌హెచ్-44పై ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకున్నది.
జడ్చర్ల, జూలై 15 : ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి సమీపంలోని ఎన్‌హెచ్-44పై ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ధర్మవరానికి బయలుదేరింది.
ఈ క్రమంలో బూరెడ్డిపల్లి సమీపంలో హైవేపై యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో అదుపుతప్పి కుడివైపున రోడ్డును దాటి కిందకు వెళ్లగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలను పగులగొట్టుకొని బయటపడ్డారు. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఎస్సై శివానందం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
డ్రైవర్ సహా బస్సులో 37 మంది ప్రయాణిస్తుండగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు. వారిలో మైథిలి, లక్ష్మీదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి ముడావత్, డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

