దామన్న, పార్థసారథిరెడ్డి ఏకగ్రీవం
- రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక
- ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను: పార్థసారథిరెడ్డి
- రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతా
- సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తా
- అవకాశమిచ్చిన కారణజన్ముడికి కృతజ్ఞతలు
- రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారథిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ధ్రువపత్రాలు అందజేశారు. వీరి నామినేషన్లతోపాటు దాఖలైన మరో రెండు తిరస్కరణకు గురవటంతో ఇద్దరూ ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని పేర్కొన్నారు. అతిగొప్ప అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తన అభ్యర్థితాన్ని బలపరచిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీఆర్ఎస్ నేతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పనిచేస్తానని చెప్పారు. తనపై విశ్వాసంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టడానికి సర్వదా ప్రయత్నిస్తానని రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు పేర్కొన్నారు. ‘రాజ్యసభ సభ్యుడిగా నన్ను ఎంపిక చేసిన అపర భగీరథుడు, కారణజన్ముడు, తెలంగాణ కర్త, అభివృద్ధి ప్రదాత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
ముఖ్యమంత్రి మార్గదర్శనంలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంటులో నిరంతరం కృషి చేస్తా. సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆదర్శాల అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపిస్తా. టీఆర్ఎస్ సైనికుడిలా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో ఉడతాభక్తిగా నా వంతు పాత్ర పోషిస్తా’అని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

