Dalit Bandhu | ‘బలగం’ మొగిలయ్యకు ‘దళితబంధు’ పథకం కింద కారు పంపిణీ..
Dalit Bandhu | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా దళితులకు అండగా ఉంటుందని, ఇందుకు నిదర్శనమే బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు దళిత బంధు పథకం కింద కారు పంపిణీ చేయడమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Dalit Bandhu | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా దళితులకు అండగా ఉంటుందని, ఇందుకు నిదర్శనమే బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు దళిత బంధు పథకం కింద కారు పంపిణీ చేయడమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బలగం సినిమాలో తమ పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారును అందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సుంకె రవిశంకర్, జోగినపల్లి శ్రీనివాసరావు, బేడ బుడగ జంగాల జేఏసీ చైర్మన్ టి.జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరితో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులందరు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. మూడేండ్లలో దళితులందరికీ దళిత బంధు ద్వారా ఆర్థిక సాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు. అందుకే అందరి క్షేమం కోసం ఆలోచిస్తూ, పరిపాలన సాగిస్తున్నారని, దళితులంతా ఆయనకు అండగా నిలవాలని మంత్రి కోరారు. బలగం సినిమాలో అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకున్న మొగిలయ్య, కొమురమ్మలకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు. మొగిలయ్య ఆరోగ్యం బాగు కోసం నిమ్స్‌లో చేర్పించి వైద్యం చేయిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మానవత్వమున్న ప్రభుత్వమని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు..
ఈ సందర్బంగా మొగిలయ్య, కొమురమ్మ దంపతులు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బేడ బుడగ జంగాల జెఎసి చైర్మన్ టి.జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరిలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే బేడ బుడగ జంగాల ప్రతినిధిగా చింతల యాదగిరికి తగిన పదవి ఇచ్చి, గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

